Posts

Showing posts from May, 2026

పుట్టకి పూజ ఎందుకు? వివరణ : Why Do We Worship Snake Anthills? — Explanation : aadhyatmikam #bhakthi #nava #naaga #stotram #aadhyatmikam

Image
"This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English              content begins.”   పాఠకులకు  నమస్కారం                         పుట్టకి పూజ ఎందుకు?  వివరణ                                       మనం నాగుల చవితి కి, షష్టి కి, మంగళవారాలు ఇలా కొన్ని విశిష్టమైన  రోజులలో నాగేంద్ర స్వామికి అలాగే కొన్ని చోట్ల నాగ పుట్టకి పూజ చేస్తాం. నాగేంద్ర  స్వామికి  పూజ అంటే సరే మరి పుట్టకి ఎందుకు పూజ చేయాలి. దానిలో వున్న అంతరం  ఏమిటో ఇప్పుడు చూద్దాం .                                                                            మనం ఏదైనా వ్రతం, ఇష...

సమయపాలన : ( Punctuality ) : #సమయపాలన #Punctuality # aadhyatmikam

Image
"This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English              content begins.”                        పాఠకులకు  నమస్కారం  సమయపాలన అంటే ఏమిటి?       సమయపాలన అంటే ఒక పనిని ప్రతిరోజు ఒకే సమయంలో చేయడం. ఇది  మనిషి జీవితంలో చాలా ముఖ్యం. ఈ సమయపాలన పాటించి చేసే ప్రతి పని  యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. అది పూజ కావచ్చు, జపం, ధ్యానం,  పారాయణ ఇలా దైవిక సంబంధించినదే కాకుండా, మన దైనందిక  జీవితంలో  చేసే పనులకు కూడా సమయపాలన పాటిస్తే ఫలితం చాలా బాగుంటుంది.      పారాయణ విషయానికి వస్తే, ఒకవేళ మీరు సుందరకాండ పారాయణం 40  రోజులపాటు చేద్దాం అనుకున్నారు. ఒకరోజు ఉదయం చేస్తే,  మరుసటి రోజు  సాయంత్రం, అంటే మీ వీలుని బట్టి చేస్తారు. అది తప్పు కాదు. కానీ ప్రతిరోజు  సాయంత్రం సరిగ్గా ఆరున్నరకి దీపారాధన చేసి, సుందరకాండ చేద్దామనుకొని,  ఖచ్చితంగా 40 రోజులు ఎన్ని అవాంతరాలు వచ్చినా సరి...

అధిక మాసం అంటే ఏమిటి ? What is an Adhika Masam (Leap Month)? #అధిక #మాసం #అంటే #ఏమిటి ? #What #is #an #Adhika #Masam (#Leap #Month)? #aadhyatmikam

Image
“This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English              content begins.”             పాఠకులకు  నమస్కారం      అధికమాసం అంటే ఏమిటి?       మనకి తెలిసిన మాసాలు 12. చైత్రమాసం మొదలుకొని ఫల్గుణ మాసం వరకు. మనకి     కాలగమనాలు రెండు రకాలు. మొదటిది సూర్య లేదా సౌరమానము, రెండవది   చంద్రమానము  లేదా  చాంద్రమానము. కానీ మనము చాంద్రమానాన్ని పరిగణలోకి  తీసుకుంటాము. ఎందుకంటే  ఈ 12  నెలలు అనేవి సూర్య గమనాన్ని బట్టి కాకుండా చంద్ర  గమనాన్ని బట్టి ఏర్పడ్డాయి.  ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వింటున్నదే,  చంద్రుడు  భూమి చుట్టూ తిరగడానికి పట్టే  సమయం  నెలరోజులు అని.      ఇక్కడ నెల అంటే ఎన్ని రోజులు. చాంద్రమానంలో నెల అంటే 29 రోజులు ( సుమారు  29.53  రోజులు ). నెలకి 29.53 రోజులు చొప్పున సంవత్సరానికి చూసుకుంటే 29.53×12=354.36  (  సుమారు  354) రోజులు....

భక్తి అంటే ఏమిటి ? What is devotion? #భక్తి #అంటే #ఏమిటి #? #What #is #devotion?

Image
 “ This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English              content begins.”    పాఠకులకు నమస్కారం.                                                                                                భక్తి అంటే ఏమిటి?                                                           భక్తి   ఒక అనిర్వచనీయమైన తన్మయత్వం. భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే.  రాముడిని తీసుకుంటే, ఆంజనేయుడి సేవలో భక్తి వుంది, సుగ్రీవుడి స్నేహంలో భక్తి వుంది,  విభీషణుడి శరణాగతిలో భక్తి వుంది, శబరి ఆదరణ లో భక్తి వుంది, రాముని...