పుట్టకి పూజ ఎందుకు? వివరణ : Why Do We Worship Snake Anthills? — Explanation : aadhyatmikam #bhakthi #nava #naaga #stotram #aadhyatmikam
"This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English content begins.”
పాఠకులకు నమస్కారం
మనం నాగుల చవితి కి, షష్టి కి, మంగళవారాలు ఇలా కొన్ని విశిష్టమైన
రోజులలో నాగేంద్ర స్వామికి అలాగే కొన్ని చోట్ల నాగ పుట్టకి పూజ చేస్తాం. నాగేంద్ర
స్వామికి పూజ అంటే సరే మరి పుట్టకి ఎందుకు పూజ చేయాలి. దానిలో వున్న అంతరం
ఏమిటో ఇప్పుడు చూద్దాం .
మనం ఏదైనా వ్రతం, ఇష్ట దేవత పూజ చేసుకునేటప్పుడు ముందుగా
గణపతిని పూజిస్తాం. ఎలా? ఒక చిన్న పసుపు ముద్దని చేసి దానిలో గణపతుల వారిని
అవాహన చేసుకొని పూజిస్తాం. దానికి కుంకుమ అద్దినా, అక్షతలు చెల్లిన, అభిషేకం చేసి
బెల్లం ముక్క నైవేద్యం పెట్టిన అదంతా గణపతికి చేస్తున్నట్లు భావిస్తాం. అలాగే మనం
మన ఇష్ట దేవత ఆరాధనా చేస్తున్న అలానే చేస్తాం.
మనం నాగ దేవత ఆరాధన కొన్ని పర్వ దినాలలో విశేషంగా చేస్తాం.
నాగ దేవతలందరికి అధిదేవత ఆదిశేషుడు. కొందరు సుబ్రహ్మణ్య స్వామిగా, మానస
దేవిగా, నాగ దేవతగా ఒక్కొక్కరు ఒక్కో భావనతో పూజిస్తాం. మరి వారి నివాస స్థలం
ఊర్ధ్వలోకాలు. ఆదిశేషుడు వైకుంఠంలో, వాసుకి కైలాసంలో, తక్షకుడు ఇంకా ఇతర నాగ
దేవతలు ఉండేది దేవ లోకంలో అంటే స్వర్గం లో. వీరిని నవ నాగులుగా మనం కొలుస్తాం.
వారే అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, శంఖపాల, ధాత్ర రాష్ట్ర, తక్షక మరియు
కాళియ అనే తొమ్మిది మంది నాగరాజులు .మరి వీరిని కొలవాలంటే వీరి ప్రతి రూపాలు
ఏవిటి అంటే అవే నాగ పుట్టలు.
ఎలా అయితే మనం ఇతర దేవతలని పూజించేటప్పుడు పసుపు
ముద్దని చేసుకొని వాటిలోకి మన ఇష్ట దేవతని ఆవాహన చేసుకొని పూజిస్తామో అలాగే ఈ
నాగ దేవతలని కూడా ఆవాహన చేసుకోవాలంటే పూట్టలని పూజిస్తాం. అక్కడ పసుపు
ముద్ద ఎలాగో ఇక్కడ పుట్ట అలా అన్నమాట. అందుకే మనం చవితి రోజు పుట్ట ని
పూజించేది. ఆ పుట్టకి పాలు పోసిన, పసుపు కుంకుమ చెల్లిన, చిమ్మిరి, చలివిడి నైవేద్యం
పెట్టిన అది ఆ నాగ దేవతలకే చెందుతుంది. మనం పుట్టలో పాలు పోసేటప్పుడు నవ నాగ
స్తోత్రం చదువుతూ చేస్తే ఫలితం రెట్టింపుగా ఉంటుంది .
నవ నాగ స్తోత్రం : అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ ,
శంఖపాలం ధాత్ర రాష్ట్రం తక్షకం కాళియం తథా , ఏతాని నవ నామాని నాగానాం చ
మహాత్మనహ , సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః , తస్య విషభయం నాస్తి
సర్వత్ర విజయీ భవేత్ |
కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే చాలామంది పుట్ట పైన కోడి
గుడ్లు పెడుతుంటారు. అంటే అక్కడ వాళ్ళు నాగ దేవతని ఒక సాధారణ పాముగా
చూస్తున్నారు. వారు తెలియక చేసే తప్పులు. నాగ దేవతలు వేరు. పాములు వేరు.
పాములు విషాన్ని చిమ్మితే నాగ దేవతలు మన సంకల్పన్ని అమృతం లా ప్రసాదిస్తారు.
మనం పుట్టకి పూజ చేసేటప్పుడు ఒక్కోసారి పాములు కనపడతాయి పుట్టలో. అప్పుడు
వాటిని నాగ దేవతగా భావన చేసి ప్రార్ధించాలి.
ఈ పుట్టకి పూజ చేసేటప్పుడు నియమ నిష్ఠలతో పూజించాలి. ఎలా
పడితే ఆలా చేయకూడదు. ముఖ్యంగా నాగ ప్రతిమలను పూజించేటప్పుడు చాల మంది
పాలు పోసి పైన పసుపు, కుంకుమ పోసి నైవేద్యం పెట్టి ఆలా వదిలేస్తారు. అది చాల
తప్పు. ముందుగా ప్రతిమని నీళ్లతో చక్కగా కడగాలి. తర్వాత తెచ్చుకున్న ద్రవ్యాలతో
అభిషేకం పూర్తి ఐన తర్వాత మళ్ళి ప్రతిమని నీళ్లతో శుభ్రంగా కడిగి అప్పుడు బొట్టు పెట్టి
అలంకారణ చేయాలి. ఆ తర్వాత పూజ పూర్తి చేసుకోవాలి. నాగేంద్ర స్వామి విగ్రహం
పాలతో ఎండిపోకూడదు. అందుకే పాలతో అభిషేకించిన తర్వాత నీళ్లతో శుభ్రంగా
కడగాలి. ఆ విధంగా స్వామిని పూజిస్తే స్వామి అనుగ్రహం తప్పక ఉంటుంది.
మీ
బొడ్డుపల్లి విశ్వనాధ ఫణి
Comments
Post a Comment