సమయపాలన : ( Punctuality ) : #సమయపాలన #Punctuality # aadhyatmikam

"This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English              content begins.”  


                    


పాఠకులకు  నమస్కారం 

సమయపాలన అంటే ఏమిటి?

      సమయపాలన అంటే ఒక పనిని ప్రతిరోజు ఒకే సమయంలో చేయడం. ఇది 

మనిషి జీవితంలో చాలా ముఖ్యం. ఈ సమయపాలన పాటించి చేసే ప్రతి పని 

యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. అది పూజ కావచ్చు, జపం, ధ్యానం, 

పారాయణ ఇలా దైవిక సంబంధించినదే కాకుండా, మన దైనందిక  జీవితంలో 

చేసే పనులకు కూడా సమయపాలన పాటిస్తే ఫలితం చాలా బాగుంటుంది.

     పారాయణ విషయానికి వస్తే, ఒకవేళ మీరు సుందరకాండ పారాయణం 40 

రోజులపాటు చేద్దాం అనుకున్నారు. ఒకరోజు ఉదయం చేస్తే, మరుసటి రోజు 

సాయంత్రం, అంటే మీ వీలుని బట్టి చేస్తారు. అది తప్పు కాదు. కానీ ప్రతిరోజు 

సాయంత్రం సరిగ్గా ఆరున్నరకి దీపారాధన చేసి, సుందరకాండ చేద్దామనుకొని, 

ఖచ్చితంగా 40 రోజులు ఎన్ని అవాంతరాలు వచ్చినా సరిగ్గా అదే సమయానికి 

పారాయణ చేస్తే మీరు ఏ సంకల్పంతో అయితే పారాయణ చేస్తున్నారో ఆ 

సంకల్పం రెట్టింపు ఫలితంగా మీకు దక్కుతుంది. ఇది కేవలం సుందరకాండ 

పారాయణం మాత్రమే కాదు ఏదైనా సరే అంటే లలితా పారాయణం, భగవద్గీత 

ఇలా సమయపాలన పాటించాలి.

     ఇక మన దైనందిక జీవితానికి వద్దాం. ఉదాహరణకు మనకు జ్వరం కానీ, 

తలనొప్పి గాని జలుబు గాని ఏదైనా వచ్చి డాక్టర్ వద్దకు వెళితే ఆయన మనకు 

మందులు రాసి చెప్పే మాట టైం కి మాత్రలు వేసుకోండి అని. అంటే ఒక నిర్దిష్ట 

సమయంలో మీరు డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్ ని రోజు వేసుకుంటే ఆ మాత్ర 

త్వరగా పని చేస్తుంది.

     ఇంకొక ఉదాహరణ తీసుకుంటే మీరు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి  

నిద్రలేద్దామనుకున్నారు. అలారం పెట్టుకుని రోజు కచ్చితంగా ఐదు గంటలకు 

నిద్రలేస్తున్నారు.మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా దానిని అలవాటు 

చేసుకోవాలి. ఇలా రోజు నిద్ర మేల్కొనే విషయంలో సమయపాలన పాటిస్తే మీ 

గడియారం పాడైపోయిన అలారం ఆలస్యంగా మ్రోగిన మీరు మాత్రం 

కచ్చితంగా  ఐదు గంటలకు నిద్ర లేస్తారు. ఎందుకంటే మీ మెదడు దానిని 

రిజిస్టర్ చేసుకుంటుంది. మీరు ఒకరోజు రోజులానే ఐదు గంటలకు అలారం 

పెట్టుకుని పడుకున్నారు. కానీ అలారం మోగకుండానే మీకు మెలకువ 

వచ్చింది.  గడియారం చూస్తే దానిలో సమయం ఉదయం 4:50 అయింది. 

ఇప్పుడు కచ్చితంగా చెప్పొచ్చు గడియారం 10 నిమిషాలు ఆలస్యంగా 

పనిచేస్తుందని. ఎందుకంటే మీ మెదడుకు తెలుసు అప్పుడు సమయం 4:50 

కాదు 5 అని. సమయపాలన పాటిస్తే ఫలితం అంత ఖచ్చితంగా ఉంటుంది. 

             అంతే కాకుండా ఆరోగ్యం విషయంలో కూడా మనం క్రమశిక్షణ కలిగి 

ఉండాలి. సమయానికి ఫలాహారం , భోజనం, రాత్రి భోజనం చేయాలి అదికూడా 

మితంగా . అప్పుడే మన శరీరం ఎటువంటి రోగాల పాలవకుండా ఉంటుంది.

            సమయపాలన వలన మనకు క్రమశిక్షణ అలవరుతుంది. మీరు ఒక్క 

విషయంలో సమయపాలన పాటిస్తే మీకు తెలియకుండానే   మీరు మిగతా  

అన్ని పనులలో కూడా సమయపాలన పాటిస్తారు. కాబట్టి మనమందరం ఈ 

సమయపాలన పాటిద్దాం.

                                                                     

                                                                                                             మీ 

                                                                                          బొడ్డుపల్లి విశ్వనాధ ఫణి 


 * అధిక మాసం అంటే ఏమిటి ?

 * భక్తి  అంటే ఏమిటి ?

 * పుట్టకి పూజ ఎందుకు? వివరణ

   * అష్ట సిద్ధులు : వాటి అర్ధాలు

  *శ్రీ కృష్ణుని రాస లీలలు - అసలు అర్ధం :

  * చతురంగ బలాలు అంటే ?

  * గజముఖ గణపతి

                           [ English Version ] 👇

Greetings to the readers,

What is Punctuality?

            Punctuality means doing a task at the same time every day. It is very important in a person’s life. Any work done with punctuality gives wonderful results. Whether it is पूजा (prayer), chanting, meditation, or recitation of sacred texts, not only spiritual activities but also our daily life activities become more fruitful when done with proper timing and discipline.

            Coming to spiritual recitations, suppose you decide to recite the Sundarakanda for 40 days. One day you may do it in the morning and the next day in the evening, depending on your convenience. There is nothing wrong with that. However, if you decide to perform the evening lamp prayer every day at exactly 6:30 PM and then recite the Sundarakanda at the same time continuously for 40 days, despite any obstacles, then the intention with which you are doing the recitation will yield double the results. This applies not only to Sundarakanda recitation, but also to Lalitha Sahasranamam, Bhagavad Gita recitation, and all other spiritual practices. Punctuality should always be maintained.

             Now let us look at daily life. For example, if we have fever, headache, or a cold and visit a doctor, the doctor prescribes medicines and says, “Take the tablets on time.” This means that if you take the prescribed medicine every day at a fixed time, it works more effectively and helps you recover faster.

               Let us take another example. Suppose you decide to wake up every morning at 5 o’clock. You set an alarm and wake up exactly at 5 AM every day. In the beginning, it may feel difficult, but gradually it becomes a habit. If you maintain punctuality in waking up daily, then even if your clock stops working or the alarm rings late, you will still wake up exactly at 5 AM. This is because your brain registers the timing. One day, you may set the alarm for 5 AM as usual, but wake up before the alarm rings. When you check the clock, it shows 4:50 AM. At that moment, you can confidently say that the clock is running ten minutes late, because your brain already knows it is actually 5 AM. Such is the accuracy and power of punctuality.

              Not only that, we should also maintain discipline regarding our health. We should eat fruits, meals, and dinner on time, and in moderation. Only then will our body remain healthy and free from diseases.

               Punctuality develops discipline within us. Once you practice punctuality in one aspect of life, you will unknowingly begin to follow it in all other activities as well. Therefore, let all of us practice punctuality.

                                                                                                                     Yours,
                                                                                              Boddupalli Viswanadha Phani

 * what is leap month?

 * what is devotion?

 *Why Do We Worship Snake Anthills? — Explanation

  * shodasopacharaas : their meaning

 * The True Meaning of Sri Krishna’s Rasa Leelas

 *  What are Chaturanga Balas (fourfold army) ?

 * Gajamukha Ganapathi ( Elephant-faced Lord Ganesha ) 

 

Comments

  1. చాలా బాగా చెప్పారు సార్
    కచ్చితంగా సమయ పాలన పాటిస్తాము
    thank you sir for sharing your valuable sentence 🙏🏻👍🏻
    Punctuality and time management is very important in life

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పరిచయం ( Introduction ) : ఆధ్యాత్మికం ( Spirituality) #పరిచయం #Introduction #: #ఆధ్యాత్మికం #Spirituality

భక్తి అంటే ఏమిటి ? What is devotion? #భక్తి #అంటే #ఏమిటి #? #What #is #devotion?

పుట్టకి పూజ ఎందుకు? వివరణ : Why Do We Worship Snake Anthills? — Explanation : aadhyatmikam #bhakthi #nava #naaga #stotram #aadhyatmikam