అధిక మాసం అంటే ఏమిటి ? What is an Adhika Masam (Leap Month)? #అధిక #మాసం #అంటే #ఏమిటి ? #What #is #an #Adhika #Masam (#Leap #Month)? #aadhyatmikam
“This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English content begins.”
పాఠకులకు నమస్కారం
అధికమాసం అంటే ఏమిటి?
మనకి తెలిసిన మాసాలు 12. చైత్రమాసం మొదలుకొని ఫల్గుణ మాసం వరకు. మనకి
కాలగమనాలు రెండు రకాలు. మొదటిది సూర్య లేదా సౌరమానము, రెండవది
చంద్రమానము లేదా చాంద్రమానము. కానీ మనము చాంద్రమానాన్ని పరిగణలోకి
తీసుకుంటాము. ఎందుకంటే ఈ 12 నెలలు అనేవి సూర్య గమనాన్ని బట్టి కాకుండా చంద్ర
గమనాన్ని బట్టి ఏర్పడ్డాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వింటున్నదే,
చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం నెలరోజులు అని.
ఇక్కడ నెల అంటే ఎన్ని రోజులు. చాంద్రమానంలో నెల అంటే 29 రోజులు ( సుమారు
29.53 రోజులు ). నెలకి 29.53 రోజులు చొప్పున సంవత్సరానికి చూసుకుంటే 29.53×12=354.36
( సుమారు 354) రోజులు. చాంద్రమానం ప్రకారం సంవత్సరానికి రోజులు 354. కానీ
సౌరమానం ప్రకారం సంవత్సరానికి రోజులు 365. అంటే మిగిలిపోయిన రోజులు ఎన్ని 11.
ఇప్పుడు ఈ రెండు మానాలలో ఉన్న రోజులను సమానం చేయాలంటే చాంద్రమానంలో
ఉన్న 354 రోజులకు మిగిలిన 11 రోజులు కలపాలి. ఆ మిగిలిన 11 రోజులను ఏ విధంగా
కలపాలి అన్నది ప్రశ్న. మనకి వారానికి 7 రోజులు, నెలకు 29.53 రోజులు అంటే ఈ 11
రోజులని ఒక కొత్త వారంగా గాని, నెలగా గాని కలపడం కష్టం.
అందుకని ఒక సంవత్సరానికి 11 రోజులు చొప్పున 3 సంవత్సరాలకు (అంటే సుమారు 32.5
నెలలకు) తీసుకుంటే చాంద్రమాన సంవత్సరం సౌరమాన సంవత్సరం కంటే 30 రోజులు
తక్కువ. అందుకని మిగిలిన 30 రోజులను ఉన్న 12 మాసాలతో పాటు అధికంగా ఒక నెలగా
పరిగణించారు. అదే అధికమాసం.
మనం గమనిస్తే ప్రతి మూడేళ్లకు( సుమారు 32.5 నెలలకు ) ఒకసారి ఒక అధికమాసం
వస్తుంది. ఇలా అధికమాసం కలపడం ద్వారా రెండు మానాలలో ( సౌర మరియు చాంద్ర )
ఉన్న రోజులని సరి చేయడం జరుగుతుంది.
మీ
బొడ్డుపల్లి విశ్వనాధ ఫణి
[ English Version ] 👇
Comments
Post a Comment