చతురంగ బలాలు అంటే ? What are Chaturanga Balas (fourfold army) ? #ఆధ్యాత్మికం #, #భక్తి #దైవం #సనాతన # #ధర్మం #హైందవం ,
"This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English content begins.”
మన భారతీయ పురాణ , ఇతిహాసాలలో ఒక రాజును లేదా ఒక చక్రవర్తిని
చాలా గొప్పవాడు అని చెప్పటానికి అతని దానగుణం, అతని పరిపాలన, అతని వీరత్వం ,
అతనికి వున్న చతురంగ బలాలు ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటారు. మరి ఈ
చతురంగ బలాలు అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ముఖ్యంగా చతురంగ బలాలు అంటే " చతుర్ " అంటే నాలుగు , " అంగ "
అంటే ఆయుధం లేదా అవయవం . వీటినే చాలా శ్లోకాలలో " రధ గజ తురగ పదాతి
సమావృతమ్ " అని సూచించటం జరిగింది.
ఈ చతురంగ బలాలు ఏమిటో ఇప్పుడు చూదాం.
* రధ దళం : అంటే రధాలని కలిగి వున్న సైన్యం. వీరు రధాలలో వుండి యుద్ధం
చేసేవారు. ఈ రధాలు అందులో వున్న సైన్యాన్ని శత్రువులు వదిలిన
ఆయుధాల నుంచి అప్పుడప్పుడు కాపాడతాయి. పైగా ఈ రధ దళ
సైన్యానికి పలు రకాలైన ఆయుధాలు ఉండేవి. వాటిని యుద్ధ సమయంలో
భద్రపరచుకోటానికి ఈ రధాలు ఉపయోగపడతాయి.
* గజ దళం : అంటే ఏనుగులను వాహనాలుగా చేసుకొని యుద్ధం చేసే సైనికుల
సమూహం. వీరు ఏనుగుల మీద నుంచి యుద్ధం చేస్తారు. కొన్నిసార్లు ఈ
ఏనుగులు కూడా శత్రువులను సంహరించటంలో ఉపయోగపడతాయి.
* తురగ దళం :
అంటే గుర్రాలను వాహనాలుగా చేసుకొని యుద్ధం చేసే సైనికుల విభాగం.
ఇవి దూరంగా వున్న శత్రువుల దగ్గరికి త్వరగా వెళ్ళటానికి, లేదా దూరంగా
శత్రువుల వలన ప్రమాదంలో వున్న మిత్రులను కాపాడటానికి ఈ గుర్రాలు
ఉపయోగపడతాయి.
* పదాతి దళం :
అంటే ఎటువంటి వాహనం లేకుండా నడుస్తూ యుద్ధరంగానికి చేరి యుద్ధం
చేసే వీరుల విభాగం.
ఏ రాజు దగ్గర ఈ చతురంగ బలాలు సమృద్ధిగా వుంటాయో వారిని
యుద్ధంలో ఓడించటం చాలా కష్టం. అందుకే ఎవరైనా ఒక రాజుపై యుద్ధం
ప్రకటించేటప్పుడు ఆ రాజుకి వున్నఈ చతురంగ బలాల గురించి తెలుసుకున్న తర్వాతే
యుద్ధ ప్రకటన చేస్తారు .
అయితే ప్రతి మనిషిలోనూ చతురంగ బలాలు ఉండాలి.
అవే * సహనం కలిగి ఉండటం
* శ్రమకు ఓర్చుకోవటం
* వాక్చాతుర్యం కలిగి ఉండటం
* నైపుణ్యాన్ని కలిగి ఉండటం.
ఈ నాలుగు రకాలైన బలాలను ఎవరైతే కలిగి వుంటారో వాళ్ళు జీవితంలో ఉన్నత
స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటారు.
మీ
బొడ్డుపల్లి విశ్వనాధ ఫణి
[ English Version ] 👇
Comments
Post a Comment