షోడశోపచారములు : వాటి అర్ధాలు : shodasopacharaas : their meaning : aadhyatmikam
"This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English content begins.”
పాఠకులకు నమస్కారం.
షోడశోపచారములు : వాటి అర్ధాలు
మనమందరం భగవంతుడిని మనకి వీలుని , మనకి వున్నా
సమయాన్ని , మనకి వున్నా ఓపికని బట్టి ఒక్కో విధంగా పూజిస్తాం. భగవంతుని ఆరాధనా
ఎలా చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఎంత శ్రద్ధగా , ఎంత భక్తితో చేస్త్తున్నామన్నదే
ముఖ్యం. అయితే ముఖ్యమైన పర్వదినాలలో భగవంతుడిని చాలామంది
షోడశోపచారములతో పూజిస్తారు. ప్రతి రోజు భగవంతుడిని ఇలా షోడశోపచారములతో
పూజించేవారు వున్నారు. అయితే అసలు ఏమిటి ఈ షోడశోపచారములు ? అవి ఏమిటో
ఆలా పూజించటంలో వున్నా ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు చూదాం.
మన ఇంటికి ఎవరైనా అతిధి వస్తే ఎలా వారికి మర్యాద చేస్తామో ఆలా
భగవంతుడిని మనం ఒక అతిధిలా భావించి చేసే పూజే ఈ షోడశోపచారముల పూజ.
మొత్తం ఈ షోడశోపచారాలు 16.
1. ఆవాహనం : మనం ఈ దేవుడినైతే పూజించ తలచామో వారిని ఆవాహన చేయటం.
అంటే వారిని మన ఇంటికి అతిధిలా ఆహ్వానించటం.
2. ఆసనం : ఇంటికి వచ్చిన భగవంతుడు కూర్చోటానికి ఆసనం ( పీఠం ) సమర్పించటం.
3. పాద్యం : భగవంతుడు కాళ్ళు కడగటానికి నీళ్లు ఇవ్వటం.
4. అర్ఘ్యం : భగవంతుడు చేతులు కడగటానికి లేదా అర్ఘ్యం ఇవ్వటానికి నీళ్లు ఇవ్వటం.
5. ఆచమనీయం : భగవంతఁడు త్రాగటానికి లేదా నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోటానికి
ఇచ్చే పవిత్రమైన జాలం.
6. స్నానం : భగవంతుడు స్నానం చేయుటకు పవిత్ర జలాలని సమర్పించటం.
7. వస్త్రం : స్నానం తర్వాత భగవంతుడు కట్టుకోటానికి వస్త్రం సమర్పించటం.
8. యజ్ఞోపవీతం : భగవంతుడికి యజ్ఞోపవీతం ( జంధ్యము) ని సమర్పించటం.
9.గంధం : భగవంతునికి మంచి సువాసనభరితమైన గంధాన్ని సమర్పించటం.
10. పుష్పము. భగవంతుని పుష్పాలతో అలంకరించటం.
11. ధూపం : భగవంతుడు ప్రీతీ చెందునట్లు సుగంధమైన ధూపాన్ని సమర్పించటం.
12. దీపం : భగవంతునికి దీపాన్ని చూపించటం.
13. నైవేద్యం : భగవంతునికి మంచి రుచి గల పిండివంటలని, ఆహారాన్ని వడ్డించటం.
14. తాంబూలం : భగవంతునికి భోజనం తర్వాత తాంబూలం ఇవ్వటం.
15. నీరాజనం : పైవన్నీ చేస్తున్నప్పుడు ఎవరైనా చూసి దిష్టి పెట్టరేమో అని భగవంతునికి
కర్పూర హారతితో దిష్టి తీయటం.
16. మంత్రపుష్పమ్ : పూజ ముగిసిన తర్వాత భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ
మంత్ర పూరితమైన పుష్పాలని సమర్పించటమే మంత్రపుష్ప పఠనం .
ఇలా భగవంతుడిని షోడశోపచారాలతో పూజిస్తే మనసుకి ప్రశాంతత లభిస్తుంది.
ఇవన్నీ చేసేటప్పుడు భగవంతుడు మన ఎదురుగా వుండి ఇవన్నీ స్వీకరిస్తున్నారన్న
భావనతో చేయాలి. అప్పుడు పూజ యొక్క ఫలితం రెట్టింపుగా ఉంటుంది.
మీ
బొడ్డుపల్లి విశ్వనాధ ఫణి
Comments
Post a Comment