గజముఖ గణపతి : Gajamukha Ganapathi ( Elephant-faced Lord Ganesha ) : Aadhyatmikam #ఆధ్యాత్మికం #, #భక్తి #దైవం #సనాతన # #ధర్మం #హైందవం ,
పాఠకులకు నమస్కారం .
గజముఖ గణపతి అంటే ఏనుగు ముఖం కలిగిన వినాయకుడు . హిందూ
మతంలో అత్యంత విస్తృతంగా ఆరాధించబడే దేవతలలో ఒకరు వినాయకుడు . ఈ పేరు
సంస్కృత పదాలైన గజ (ఏనుగు), ముఖ (ముఖం), గణపతి (గణాలకు లేదా దివ్య
సేవకులకు అధిపతి) అనే పదాల కలయికతో ఏర్పడింది.
గణపతి జ్ఞానానికి పరమాధిపతి, అన్ని విఘ్నాలను తొలగించే దేవుడు, కొత్త ప్రారంభాలకు
ఆశీర్వాదం అందించే దేవుడిగా పూజించబడతాడు.
ఏనుగు ముఖం వెనుక కథ :
హిందూ పురాణాల ప్రకారం, పార్వతి దేవి కైలాసంలో
స్నానమాచరించుటకోసం వంటికి పూసుకోటానికి నలుగు పిండిని తయారు చేసి దానితో
ఒక అందమైన బాలుడి ప్రతిమని చేసి దానికి ప్రాణం పోసింది. అతడే వినాయకుడు
. తర్వాత ఆ బాలుడిని తన మందిరం బైట కాపలాగా ఉండమని ఆదేశించింది. అమ్మ
మాట ప్రకారం ఎవరు లోపలి రాకుండా బైట కాపలా కాస్తూ వున్నారు గణపతి. అప్పుడే
శివుడు కైలాసానికి తిరిగి వచ్చి లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా, చిన్న బాలుడైన
వినాయకుడు ఆయనను తన తండ్రి అని తెలియక అడ్డుకున్నారు . దీంతో ఇద్దరి
మధ్య ఘర్షణ జరిగింది. ఆ యుద్ధంలో శివుడు అనుకోకుండా గణేశుని తలను
ఖండించాడు. పార్వతి దేవి తీవ్ర దుఃఖంలో మునిగిపోవడంతో, శివుడు
వినాయకునికి మళ్లీ ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు. ఆయన తన గణాలను ఉత్తర
దిశగా ముఖం చేసి ఉన్న మొదటి జీవి తలను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. వారు ఒక
శక్తివంతమైన ఏనుగు తలను తీసుకొచ్చారు. ఆ తలను బాలుడి శరీరానికి అమర్చి, శివుడు
అతనికి తిరిగి ప్రాణం పోశాడు. అలా ఆయన గజముఖ గణపతిగా ప్రసిద్ధి చెందాడు.
అయితే శివుడు తలుచుకుంటే వినాయకునికి ఏనుగు తల
కాకుండా ఇంకా సుందరమైన ముఖాన్నే అమర్చేవారే . కానీ ఎందుకని ఏనుగు తలను
అమర్చాలని నిర్ణయం చేసారంటే ఇక్కడ రెండు కారణాలు వున్నాయి. మొదటిది శివుడు
గజాసురునికి ఇచ్చిన మాట ప్రకారం వినాయకుడికి గజ ముఖాన్ని అమర్చారు.
ఇక రెండోవది. ఏనుగు తలకి ఒక విశిష్టత వుంది. గజముఖమ్ ఒక
లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని తెలియజేస్తుంది.
పెద్ద ఏనుగు తల – అపారమైన జ్ఞానం, గొప్ప మేధస్సు, విశాలంగా ఆలోచించే శక్తికి సంకేతం.
పెద్ద చెవులు – ఇతరులు చెప్పింది శ్రద్ధగా వినడం మరియు ప్రార్థనలను స్వీకరించే మనసుకు ప్రతీక.
వంపు తిరిగిన తొండం – జీవితంలోని ఎత్తుపల్లాలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని సూచిస్తుంది.
ఒకే దంతం (ఏకదంతుడు) – సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలను
అధిగమించడం మరియు ఏకాగ్రతకు ప్రతీక.
చిన్న కళ్ళు - సూక్ష్మ దృష్టికి ప్రతీక . ప్రతి విషయాన్నీ సూక్ష్మ దృష్టితో
పరిశీలన చేసిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి .
మీ
బొడ్డుపల్లి విశ్వనాధ ఫణి
[ English Version ]👇
* What is adhikamasam ( leap month )?
* Why Do We Worship Snake Anthills? — Explanation
* Asta Siddhis : Their Meanings :
* shodasopacharaas : their meaning
#ఆధ్యాత్మికం #, #భక్తి #దైవం #సనాతన # #ధర్మం #హైందవం ,
Comments
Post a Comment