అష్ట సిద్ధులు : వాటి అర్ధాలు ( Ashta Siddhis: Their Meanings ) : aadhyatmikam
"This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English content begins.”
అష్ట సిద్ధులు (ఎనిమిది దివ్య సిద్ధులు):
మన హిందూ శాస్త్రాలలో యోగులు, ఋషులు తీవ్రమైన తపస్సు మరియు
యోగసాధన ద్వారా ఎన్నో శక్తులని, సిద్ధులని పొందేవారు. వాటిలో
ముఖ్యమైన అసాధారణ సిద్ధులే ఈ అష్ట సిద్ధులు . ఈ అష్ట సిద్ధుల గురించి
ఒక శ్లోకం కూడా ప్రాచుర్యం లో వుంది.
శ్లోకం :
అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా
ప్రాప్తిః ప్రాకామ్యమీశిత్వం వశిత్వం చాష్టసిద్ధయః
ఇప్పుడు ఈ అష్ట సిద్ధులు వాటి అర్ధాలు చూద్దాం.
అణిమ – అణువు కంటే చిన్నదిగా మారగల శక్తి.
మహిమ – అపారమైన పరిమాణానికి విస్తరించగల శక్తి.
గరిమ – అత్యంత బరువుగా మారగల శక్తి.
లఘిమ – అత్యంత తేలికగా మారగల శక్తి; గాలిలో సంచరించగలగడం.
ప్రాప్తి – కోరుకున్న వస్తువు లేదా స్థలాన్ని చేరుకోగల శక్తి; దూరంలోని విషయాలను గ్రహించగలగడం.
ప్రాకామ్య – సంకల్పించినది నెరవేర్చుకునే శక్తి; ఇష్టానుసారం కార్యసిద్ధి.
ఈశిత్వ – సృష్టిలోని అంశాలపై అధిపత్యం లేదా నియంత్రణ కలిగిన శక్తి.
వశిత్వ – ఇతరులను లేదా ప్రకృతి శక్తులను తన వశంలో ఉంచగల శక్తి.
ఈ అష్ట సిద్ధుల గురించి పురాణాలలో, గ్రంధాలలో, ఇంకా చాల చోట్ల
ప్రస్తావించబడింది. ముఖ్యంగా మనం హనుమాన్ చాలీసా చూసుకుంటే
అందులో " అష్ట సిద్ధి నవ నిధికి దాత " అని ఉంటుంది. గణపతి మరియు
హనుమంతుడు ఈ అష్ట సిద్దులకి ప్రసిద్దులు .
* What is adhikamasam ( leap month )?
* Why Do We Worship Snake Anthills? — Explanation
* What are Chaturanga Balas (fourfold army) ?
* Gajamukha Ganapathi ( Elephant-faced Lord Ganesha )
#ఆధ్యాత్మికం #, #భక్తి #దైవం #సనాతన # #ధర్మం #హైందవం ,
#అష్ట #సిద్ధులు #: #వాటి #అర్ధాలు #( #Ashta #Siddhis #: #Their #Meanings )
Comments
Post a Comment